![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో......మహా స్కూటీ నేర్చుకుంటుంటే తను ఎక్కడ పడిపోతుందోనని అందరు తన చుట్టూనే ఉంటారు. అప్పుడే ఎదురుగా మనీషా వస్తుంది. మాధవ తనతో వచ్చి రానీ హిందీలో మాట్లాడతాడు. మనీషాని ఇంట్లోకి తీసుకొని వెళ్లి మాట్లాడతారు. మాధవ, కన్నా హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తారు. నారాయణ వస్తాడు. తన దగ్గర మనీషా ఆశీర్వాదం తీసుకుంటుంది.
ఆ తర్వాత చక్రి స్కూటీ నేర్పుతానంటే మహా వద్దని అంటుంది. దాంతో చక్రి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వాడు ఎంతో ఇష్టంగా స్కూటీ కొన్నాడు.. నేర్పించాలి అనుకున్నాడు.. మీరు అలా అనేసరికి ఫీల్ అవుతున్నాడని కేశవ అనగానే మరి ఏదైనా రాకపోతే వెటకారంగా మాట్లాడతాడు. అది నచ్చదని మహా అంటుంది. ఆ తర్వాత చక్రిని నారాయణ రెచ్చగొట్టినట్లు మాట్లాడుతాడు. దాంతో ఓంకారేశ్వర్ దగ్గరికి చక్రి వెళ్తాడు. ఇద్దరు కలిసి డ్రింక్ చేయడానికి వెళ్తారు. ఇన్నిరోజులవుతుంది పెళ్లి అయి కానీ తను నన్ను భర్తగా చూడడం లేదని చక్రి తనకి చెప్తూ బాధపడతాడు.
తను అమ్మాయి నువ్వు అబ్బాయి నువ్వే ఒక అడుగు ముందుకి వెయ్యాలని ఓంకారేశ్వర్ అంటాడు. దాంతో చక్రి తాగి ఇంటికి వెళ్తాడు. నారాయణతో మాట్లాడతాడు. లోపల మహా గదిలోకి వెళ్తాడు. నన్ను భర్తగా ఎప్పుడు ఒప్పుకుంటావని పడుకున్న తనతో చెప్తుంటాడు. తరువాయి భాగంలో మహా గట్టిగా అరిచి బయటకు వస్తుంది. ఏమైందని మాధవ అడుగుతాడు. నేను నీ భర్త అంటూ చక్రి బెడ్ పైకి వచ్చాడని మహా ఏడుస్తుంది. ఏం చేస్తున్నావ్ రా అని మాధవ చెయ్ ఎత్తుతాడు. చక్రి కూడా మాధవపై చెయ్ ఎత్తుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |